ఎరువుల కోసం రైతులు గోస పడుతున్నా పట్టని రేవంత్ సర్కారు తీరుపై బీఆర్ఎస్ వినూత్న నిరసనకు దిగింది. శుక్రవారం వికారాబాద్ జిల్లా ధరూరు మండల కేంద్రంలో దున్నపోతును ముందు పెట్టుకుని రాస్తారోకో చేపట్టింది.
పంటలకు సరిపడా యూరియా సరఫరా చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలకులు రైతులకు అవసరమైన దాంట్లో సగం యూరియా కూడా సరఫరా చేయకుండా.. వచ్చిన యూరియానూ కొందరు నేతల అండతో.. బడాబాబులు, అధికారులు నల్లబజారుకు తరలిస్తున్నారని తీవ్రంగా మండిపడుతున్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా వెల్టూరులోని శ్రీరామలింగేశ్వర ఫర్టిలైజర్ దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.
రైతులకు దక్కాల్సిన యూరియాను దళారులు అక్రమమార్గంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు సమాచారం రావడంతో తనిఖీలు చేశారు. రికార్డులోని 300 బస్తాల యూరియా స్టాక్ అక్కడ లేకపోవడాన్ని గుర్తించారు. షాపును సీజ్ చేసి డీలర్‌పై కేసు నమోదు చేశారు.
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి సహకార సంఘం కార్యాలయంలో యూరియా కోసం ఆందోళనకు దిగిన రైతులు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని రైతు వేదికకు యూరియా కోసం భారీగా తరలివచ్చిన రైతులు
పరిగిలో యూరియా కోసం రైతుల రాస్తారోకోలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట పీఏసీసీఎస్ వద్ద రైతుల పడిగాపులు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ నిరసనను అడ్డుకుంటున్న పోలీసులు
నర్సింహులపేట సొసైటీ కార్యాలయం వద్ద ఆధార్, పట్టాదారు పాస్‌బుక్స్ జిరాక్స్ కాపీలను కిందపడేసిన అధికారులు
యూరియా ఇవ్వాలనే డిమాండ్‌తో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు, గేటు వద్ద అడ్డుకుంటున్న పోలీసులు