పెద్దవంగర, మే 14: కాంగ్రెస్ సరారు నిర్లక్ష్యంతోనే రైతన్నలు కుప్పకూలుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రామోజీ తండాకు చెందిన రైతు గుగులోత్ కిషన్ ఇటీవల పోచంపల్లి కొనుగోలు కేంద్రంలో వడదెబ్బతో మృతి చెందడంతో ఎర్రబెల్లి బుధవారం ఆయన ఇంటికి వెళ్లి చిత్రపటానికి నివాళులర్పించారు. రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రైతు కిషన్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.