ఆదిలాబాద్, ఫిబ్రవరి 14 ( నమస్తే తెలంగాణ) : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, ‘రైతు బంధు’వు కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఆదిలాబాద్ జిల్లాలో రైతులు, ప్రజలు ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో రైతులు తమ పంట పొలాల్లో కేసీఆర్ ఫ్లెక్సీకి పుష్పాభిషేకం చేసి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ‘కేసీఆర్ సారే రావాలి, మళ్లీ కారే రావాలి’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నినాదాలు చేశారు. పదేండ్ల కేసీఆర్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల ఫలితంగా రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని, కాంగ్రెస్ పాలనలో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని రైతులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, గాడ్గే సుభాష్, స్థానిక నాయకులు, రైతులు, స్థానికులు పాల్గొన్నారు.