హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో యారియా(Urea )కష్టాలు రైతన్నలను వెంటాడుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సరిపా యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలో పీఏసీఎస్ కేంద్రం వద్ద యూరియా కోసం అర్ధరాత్రి నుండే రైతుల పడిగాపులు కాస్తున్నారు. అలాగే లింగాపూర్ గ్రామంలో యూరియా బస్తాల కోసం మెట్ పల్లి సింగిల్ విండో సిబ్బందితో రైతులు వాగ్వాదానికి దిగారు.
450 బస్తాల యూరియా లోడ్ వస్తుందని తెలుసుకుని ఉదయాన్నే గోదాం వద్దకు తరలివచ్చిన అన్నదాతలు అయితే రెండు రోజుల క్రితం రెండు బస్తాల చొప్పున టోకెన్లు ఇచ్చిన 225 మందికి మాత్రమే యూరియా బస్తాలు ఇస్తామని చెప్పడంతో ఏఈఓతో పాటు సింగిల్ విండో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సిద్దిపేట జిల్లా పాలమాకుల రైతు వేదిక ముందు యూరియా కోసం వందలమంది రైతులు క్యూ లైన్ కట్టారు.
క్యూ లైన్లో 800 మంది రైతులు ఉంటే యూరియా బస్తాలు 400 చిల్లర మాత్రమే ఉండడంతో రైతుల ఆందోళన చేపట్టారు. కాగా, గ్రామంలోని రైతు వేదిక వద్ద ఉదయం 3 గంటల నుండి పడిగాపులు కాస్తుండడంతో సహనం నశించిన రైతులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలంలో PACS కేంద్రం వద్ద యూరియా కోసం అర్ధరాత్రి నుండే రైతుల పడిగాపులు
లింగాపూర్ గ్రామంలో యూరియా బస్తాల కోసం మెట్ పల్లి సింగిల్ విండో సిబ్బందితో వాగ్వాదానికి దిగిన రైతులు
450 బస్తాల యూరియా లోడ్ వస్తుందని తెలుసుకుని ఉదయాన్నే గోదాం వద్దకు తరలివచ్చిన… pic.twitter.com/cfsOH2cPPR
— Telugu Scribe (@TeluguScribe) August 24, 2025