హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): అకాల వర్షాలతో దెబ్బతి న్న పంటలకు సంబంధించి రైతుల వా రీగా పంటనష్టం సర్వే నిర్వహించాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే సీఎం ఆదేశాల మేరకు నష్టపోయిన ప్రతి రై తును ఆదుకుంటామని స్పష్టంచేశారు. బుధవారం పంట నష్టంపై ఆయన మాట్లాడుతూ… రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.