Farmer | నెల్లికుదురు, ఏప్రిల్ 22 : వడదెబ్బ తగిలి రైతు మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తిలో మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనతుర్తికి చెందిన బిర్రు వెంకన్న(55) తాను పండిన వరిని కోసి కొనుగోలు కేంద్రానికి తరలించేందుకు ధాన్యాన్ని పొలంలో ఆరబోశాడు. మంగళవారం పొద్దంతా ఆ ధాన్యం వద్దే ఉండటంతో ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యాడు. ధాన్యాన్ని నేర్పుతూ ధాన్యం రాశిపైనే కుప్పకూలి మృతి చెందాడు.