ధాన్యం కుప్పచేస్తూ రైతు కన్నుమూత
కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యాన్ని మండుటెండలో కుప్పగా చేస్తూ వడదెబ్బతో రైతు కుప్పకూలిపోయాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల చైర్మన్ కొయ్యడ పరశురాములు తండ్రి ఐలయ్య (65) ఆరెకరాల్లో వరి సాగు చేశాడు.
- వడదెబ్బతో సర్పంచ్ తండ్రి మృతి
- పాడె మోసిన రసమయి
- ఖమ్మం జిల్లాలో మరో రైతు మృతి
శంకరపట్నం/బోనకల్లు, మే 6 : కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యాన్ని మండుటెండలో కుప్పగా చేస్తూ వడదెబ్బతో రైతు కుప్పకూలిపోయాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల చైర్మన్ కొయ్యడ పరశురాములు తండ్రి ఐలయ్య (65) ఆరెకరాల్లో వరి సాగు చేశాడు. వరి కోసి గద్దపాక కొనుగోలు కేంద్రంవద్ద ఆరబెట్టాడు. మంగళవారం ఈదురుగాలులతో మబ్బులు రావడంతో ధాన్యం తడుస్తుందనే ఆందోళనతో ఎండలోనే ధాన్యాన్ని కుప్పగాచేశాడు. ఈ క్రమంలో వడదెబ్బ తగిలి ధాన్యం రాశిపై కుప్పకూలాడు.
కుటుంబసభ్యులు శంకరపట్నంలోని దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ బుధవారం గద్దపాకకు వెళ్లి, రైతు మృతదేహంవద్ద నివాళులర్పించి పాడె మోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో రైతుల బతుకులు బుగ్గిపాలవుతున్నాయని వాపోయారు. ఐలయ్య ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో పోసినప్పటికీ తూకం వేయకపోవడంతో వడ్ల కుప్పపైనే పడి ఎండదెబ్బ తగిలి మరణించడం దారుణమని విచారం వ్యక్తంచేశారు.

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఐలయ్య మృతికి ఎమ్మెల్యే కవ్వంపల్లి, ప్రభుత్వం బాధ్యత వహించి, రూ.కోటి ఎక్స్గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం సీతానగరంలో కేశగాని కృష్ణయ్య (60) రోజువారీ పనుల్లో భాగంగా బుధవారం పొలానికి వెళ్లాడు. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో పనులు ముగించుకొని ఇంటికి చేరుకుని సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబసభ్యులు దవాఖానకు తరలిస్తుండగా మృతిచెందాడు. కృష్ణయ్యకు భార్య, ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

