హైదరాబాద్: ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ పెద్దల మన్ననలు పొందుతూ అందరినీ భాగస్వాములు అయ్యేలా చేస్తున్నది. తాజాగా ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ఈ మహత్కార్యంలో పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా విద్యానగర్లోని నివాసంలో ప్రముఖ జర్నలిస్టులు మల్లేపల్లి లక్ష్మయ్య, కే రామచంద్రమూర్తితో కలిసి మొక్కలు నాటారు. తన 97వ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలిచిన చుక్కా రామయ్యకు ఎంపీ సంతోష్ కుమార్ పుట్టిన రోజు శుభాకాంక్షలతోపాటు కృతజ్ఞతలు తెలిపారు.