కేంద్రంలో కిసాన్ సర్కార్ రావాలి
రైతు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా నిలిచిందని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో కార్పొరేట్ అనుకూల సర్కార్ ఉన్నదని.. దాని స్థానంలో కిసాన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు
- రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్
- కర్ణాటక ముందర్గిలో జరిగిన రైతు సభకు హాజరు
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రైతు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే మార్గదర్శిగా నిలిచిందని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్ అన్నారు. ప్రస్తుతం కేంద్రంలో కార్పొరేట్ అనుకూల సర్కార్ ఉన్నదని.. దాని స్థానంలో కిసాన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు. కర్ణాటకలోని గదగ్ జిల్లా ముందర్గి స్టేడియంలో ‘కిసాన్ జాగృతి వికాస్ సంఘ్’ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా శుభప్రద్ పటేల్, వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్ హాజరయ్యారు.
శుభప్రద్‌పటేల్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా ప్రవేశపెట్టిందని, కాళేశ్వరంలాంటి సాగునీటి ప్రాజెక్టులను చేపట్టిందని చెప్పారు. 24 గంటల ఉచిత కరెంట్‌తో రైతుల్లో ఆత్మైస్థెర్యం పెరిగిందన్నారు. కేంద్రం సహకారం లేకున్నా పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని తెలిపారు. ఇలాంటి రైతు సరారే దేశంలో కూడా అవసరమని చెప్పారు. దీంతో సభలో జై కిసాన్ సరార్ అంటూ రైతులు మద్దతు పలికారు. అనంతరం గోపూజ, నాగలి పూజ ధనరాశి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ రైతు సంఘం అధ్యక్షుడు యుగంధర్ నాయుడు, తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి గోవింద్రావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

