మంగపేట, జూలై 24 : ములుగు జిల్లా మంగపేట మండలం చెరుపల్లి (కొత్తపేట)కి చెందిన ముత్తినేని సదాశివరావు(45) అనే రైతు డెంగీ జ్వరంతో మృతిచెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సదాశివరావుకు వారం క్రితం జ్వరం రావడంతో కుటుంబసభ్యులు ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించారు.
అయినా తగ్గకపోవడంతో ఏటూరునాగారంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లి అక్కడ మూడు రోజులు చికిత్స చేయించారు. డెంగీ జ్వరంగా నిర్ధారించి మెరుగైన వైద్యం కోసం హనుమకొండకు తీసుకెళ్లాలని అక్కడి వైద్యుడు సూచించారు. దీంతో బుధవారం హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా పరిస్థితి విషమించి గురువారం మృతిచెందాడు.