షాబాద్, సెప్టెంబర్ 18: విద్యుత్తు షాక్తో ఓ రైతు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. షాబాద్ మండలంలోని ఉబ్బగుంట గ్రామానికి రైతు చంద్రయ్య(62) గురువారం పొలానికి వెళ్లాడు. అక్కడ గడ్డికోస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు వైర్ తాకడంతో షాక్కొట్టి మృతిచెందాడు.
మృతుడి సోదరుడు దశరథ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.