దుబ్బాక,సెప్టెంబర్24 : సిద్దిపేట(Siddipet) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో(Electric shock) ఓ రైతు పొలంలోనే మృతి(Farmer dies) చెందాడు. ఈ విషాద సంఘటన దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రఘోత్తంపల్లి గ్రామానికి చెందిన గౌరి అంజయ్య(70) రోజుమాదిరిగా సోమవారం తన వ్యవసాయ పొలానికి వెళ్లాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ఒడ్డుపైన గడ్డిని కొడవలితో కోస్తుండుగా బోరుమోటర్ కేబుల్ వైరు(తీగ) తెగి అంజయ్య ఎడమ చేతికి తగిలింది.
దీంతో కరెంట్ షాక్కు గురై పొలంలో పడిపోయాడు. కొద్ది దూరంలో ఉన్న అంజయ్య కుమారుడు నరేష్ గమనించి చుట్టూ పక్కల ఉన్న రైతుల సహకారంతో అంజయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. మంగళవారం మృతుడి కుమారుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు దుబ్బాక ఎస్ఐ గంగరాజు తెలిపారు. అంజయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.