మహబూబాబాద్ రూరల్, జనవరి 24 : విద్యుత్ షాక్కు గురై బావిలో పడి తండ్రి మృతి చెందగా కొడుకు గల్లంతైన ఘటన మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం బలరాంతండా లో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన ప్రకారం.. తండాకు చెందిన కేలోవత్ మదీన్ (32) అతడి కుమారుడు లక్షిత్(4)ను తీసుకొని శనివారం పొలం దున్నడానికి వెళ్లాడు. బురద ఉండటం తో లక్షిత్ను భుజాలపై ఎత్తుకుని వెళ్తుం డగా బావి మోటర్ సర్వీస్ వైరు చిన్నారికి తగిలింది. దీంతో విద్యుత్ షాక్ గురై ఇద్దరూ పక్కనే ఉన్న బావిలో పడిపోయారు. స్థానికులు మదీన్ మృత దేహా న్ని బయటకు తీయగా, లక్షిత్ ఆచూకీ దొరకక పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. రెస్క్యూ టీం బావి వద్దకు చేరుకొని చిన్నారి మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టింది.