వాజేడు,సెప్టెంబర్ 6 : పిడుగుపాటుకు రైతు మృతిచెందిన ఘటన ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకురు శివారులోని పంటచేనులో చోటుచేసుకున్నది. కుటుంబ స భ్యుల కథనం ప్రకారం.. చింతూరుకు చెందిన ములకల ఆనందరావు (50) చెరుకూరుకు చెందిన ఓ రైతు చేనులో దుక్కిదున్నేందుకు కూలి పనికి వెళ్లాడు. మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా ఆయనపై పిడుగు పడటంతో కిందపడిపోయాడు. అక్కడున్న వారు గమనించి వెంటనే అతడిని ఏటూరునాగారం తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.