పంట ఎండిందని పానం తీసుకున్నడు.. మధ్యలోనే ఆగిపోయిన ‘ఇందిరమ్మ ఇల్లు’
కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమవుతున్న యి. ఆదుకొనేవారు కానరాక ఓ రైతన్న నిండు ప్రాణాన్ని బలి తీసుకొన్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన పాల్వంచ అశోక్ (39) రెండెకరాల వ్యవసాయ భూమినే నమ్ముకొని బతుకుతున్నాడు.
- అప్పు కూడా దొరుకక రైతన్న ఆందోళన
- పురుగుల మందు తాగి బలవన్మరణం
గంభీరావుపేట, మే 29 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమవుతున్న యి. ఆదుకొనేవారు కానరాక ఓ రైతన్న నిండు ప్రాణాన్ని బలి తీసుకొన్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన పాల్వంచ అశోక్ (39) రెండెకరాల వ్యవసాయ భూమినే నమ్ముకొని బతుకుతున్నాడు. కూలీ పనులు కూడా చేస్తుంటాడు. మొదటివిడత కింద ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో సంబురపడ్డా డు. తన చేతిలో ఉన్న పైసలతో ఇంటి నిర్మాణం మొదలు పెట్టాడు.
బిల్లులు రావడంతో గోడల వరకు పూర్తిచేశాడు. స్లాబుకు చెక్క కొట్టాడు. ఆ తర్వాత పైస లు లేకపోవడంతో పని ఆగింది. మరోవైపు యాసంగిలో సాగు చేసిన వరి పంట నీరందక ఎండిపోయింది. పంట ఎండిపోవడం, ఇల్లు ఆగిపోవడంతో ఆందోళన చెందాడు. 20న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం అశోక్ చనిపోయాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

