వినాయక్‌నగర్, జూన్ 14: వ్యవసాయభూమిలో విద్యుత్తు తీగను సరిచేస్తుండగా కరెంట్‌షాక్‌తో కౌలురైతు మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ రూరల్ మండలం ఖానాపూర్‌లో చోటుచేసుకున్నది. ఎస్సై మహేశ్ వివరాల ప్రకారం.. అంబేద్కర్‌కాలనీకి చెందిన నిమ్మ శంకర్(68) ఆరేండ్లుగా ఖానాపూర్ శివారులో సత్యపాల్ మిశ్రా కు చెందిన వ్యవసాయ భూమిని కౌలు కు తీసుకొని సాగు చేస్తున్నాడు. గురువారం పొలం వద్దకు వెళ్లిన శంకర్ బో రుమోటర్కు సరఫరా అయ్యే విద్యుత్తు తీగ తెగి ఉండటాన్ని గమనించాడు. సరిచేసే క్రమంలో విద్యుత్తు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుం బ సభ్యులు ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు. మృతుడి భార్య నిమ్మ రాజామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.