సోన్, నవంబర్ 28 : వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చలేక, గల్ఫ్ వెళ్లి అప్పులు తీర్చుదామని అక్కడి వెళ్లినా పని దొరుకక, తిరిగొచ్చి ఉన్న ఊరిలోనే ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నిర్మల్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాం గ్రామానికి చెందిన నలిమేల కాంతయ్య (43)కు ఎకరన్నర వ్యవసాయ భూమి ఉంది. ఇందులో పత్తి, వరి సాగు చేశాడు. సాగు కోసం రూ.3 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. ఆశించిన స్థాయిలో ది గుబడి రాకపోవడంతో దిగులు చెందా డు. ఈ నెల 25న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. విశ్వనాథ్‌పేట్ కాలనీలో చెట్టు కు ఉరేసుకున్నాడు. వ్యవసాయంలో నష్టాలు రావడం, గల్ఫ్‌లో పని దొరకక మనస్తాపానికి గురై కాంతయ్య ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. పోలీసు లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.