మర్పల్లి, ఫిబ్రవరి 6 : ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వికారాబాద్ జిల్లా మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్‌కు చెందిన హరిజన్ నర్సింహులుకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.. కూతుళ్ల వివాహం కాగా కుమారుడు హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. కూతుళ్ల పెండ్లిళ్లకు అప్పులు కావడం, పంట దిగుబడి రాకపోవడంతో అప్పు ఎలా తీర్చాలి అని దిగులు చెందాడు.
ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు నర్సింహులు పొలానికి వెళ్లేదారిలో పురుగులమందు తాగి కుటుంబసభ్యులకు ఫోన్‌చేశాడు. వెంటనే కుటుంబసభ్యులు పొలానికి వచ్చి నర్సింహులును వికారాబాద్‌లోని మిషన్ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రవూఫ్ తెలిపారు.