చేగుంట, ఏప్రిల్14: ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చేగుంట పోలీస్స్టేషన్ పరిధిలోని చెట్లతిమ్మాయిపల్లిలో మంగళవారం చోటుచేసుకున్నది. చేగుంట ఎస్సై చైతన్యకుమార్రెడ్డి వివరాల ప్రకారం.. రైతు పొన్న సాయిబాబా (35) తనకున్న ఎకరంతో పాటు మ రో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి వేశాడు.
బోరుబావి నుంచి నీళ్లు రాక వరి ఎండిపోయింది. దీంతో అప్పులు ఎలా తీర్చాలోనని మనస్తాపం చెంది, ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదుతో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.