చెన్నూర్ టౌన్, అక్టోబర్ 12: మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని మహంకాళీవాడకు చెందిన రైతు గడల మొండి (60) ఆర్థిక ఇబ్బందులతో ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల వర్షాలకు పొలాలు ముంపునకు గురికావడంతో పెట్టుబడికి తెచ్చిన అప్పు ఎలా తీర్చాలోనన్న బెంగతో తో మానసికవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు మృతదేహాన్ని చెన్నూర్ ప్రభుత్వ దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థిక సాయం అందజేయాలని, పునరావాస చర్యలు చేపట్టాలని ముంపు బాధిత రైతులు, కుటుంబసభ్యులు కోరుతున్నారు.