కోనరావుపేట, జూలై 29 : రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్‌కు చెందిన రైతు తాళ్లపల్లి సత్తయ్య (40) అప్పులు బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. సత్తయ్య ఎకరంతోపాటు మరికొంత భూమి కౌలుకు తీసుకుని, పెట్టుబడి కోసం రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు తీర్చే మార్గంలేక మనస్తాపం చెందిన ఆయన ఆదివారం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి పురుగులమందు తాగాడు. సిరిసిల్ల దవాఖానకు తరలించగా సోమవారం మృతిచెందాడు. మృతుడికి భార్య సరిత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఆంజనేయులు తెలిపారు.