మెట్పల్లి, జూలై 28: సాగు కలిసి రాకపోవడం, కూతురు పెళ్లికి చేసిన అప్పు తీర్చేదారి లేక ఓ రైతు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. జగిత్యా ల జిల్లా మెట్పల్లి పట్టణంలోని శివాజీనగర్‌కు చెందిన మార్గం గణేశ్ (47)కు ఎకరం భూమి ఉన్నది. మరో మూడెకరాలు కౌలు తీసుకొని వరి సాగు చేశా డు. నాలుగు నెలల క్రితం కూతురు పెళ్లి చేశాడు. ఈ క్రమంలో మనస్తాపం చెంది మెట్ప ల్లిలోని పెద్దమ్మగుడి వెనకాల ఉరేసుకొని ఆత్మహత్య చేసుకు న్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
కరెంట్ షాక్‌తో రైతుమృతి ; మోటర్ సరిచేస్తుండగా ఘటన
మెదక్ రూరల్, జూలై 28: పొలం లో బోరు మోటర్‌ను పరిశీలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మరణించాడు. ఈ ఘటన మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలం వాడి గ్రామంలో సోమవారం చోటుచేసుకున్నది. వాడి గ్రామానికి చెందిన జగన్నాథం (50) మధ్యాహ్నం పొలం వద్దకు వెళ్లాడు. బోర్వెల్ మోటర్లో సాంకేతిక లోపం తలెత్తడంతో దాన్ని సరిచేసేందుకు ప్రయత్నించగా విద్యుత్‌షాక్‌తో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు పొలం వద్దకు చేరుకొని భోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.