చిన్నశంకరంపేట,మే15: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో గురువారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. శాలిపేటకు చెందిన మాలే సత్యనారాయణ(40) ఏడాదిన్నర క్రితం వ్యవసాయంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల అప్పుచేశాడు.
ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాకపోవడం, అప్పులోళ్ల వేధింపులతో మనోవేదనకు గురైన సత్యనారాయణ గురువారం తన వ్యవసాయం భూమి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు చిన్నశంకరంపేట ఎస్సై నారాయణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.