గూడూరు, ఫిబ్రవరి 22: పంటలకు గిట్టుబాటు ధర రాక అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా గాజులగట్టు శివారు పాటిమీదిగూడెంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పాటిమీది గూడేనికి చెందిన సంగెపు రాజేశ్ (28) తనకున్న ఐదెకరాల్లో వరి, పత్తి, మక్క పంటలు సాగు చేశాడు. పెట్టుబడికి రూ.5 లక్షల వరకు అప్పు చేశాడు. పంటలకు గిట్టుబాటు ధర రాక కొంతకాలంగా ఆవేదనతో ఉంటున్న రాజేశ్ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు రాజేశ్‌ను మహబూబాబాద్‌లోని ఏరియా దవాఖానకు తరలించారు. చికిత్స పొందు తూ అదే రాత్రి చనిపోయాడు.