కొత్తగూడ, డిసెంబర్ 10: ప్రమాద వశాత్తు మంటల్లో పడి రైతు సజీవ దహనమైన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గోపాలపురంలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గోపాలపురం గ్రామానికి చెందిన తురుష చిన్నసమ్మయ్య(48) గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమి వద్ద మక్కజొన్న చొప్ప తగులబెడుతుండగా ప్రమాదవశాత్తు ఆ మంటల్లో పడిపోయి సజీవ దహనమయ్యాడు. సా యంత్రమైనా చిన్న సమ్మయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుంటూ వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి చూడగా మృతదేహం కనిపించడంతో భోరున విలపించారు.