కురవి, జనవరి 30: వంద శాతం రుణమాఫీ అయ్యే వరకు పోరాటం చేస్తానని గిరిజన యువరైతు భూక్యా విజయ్‌కుమార్ నాయక్ స్పష్టంచేశారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం హరిదాసుతండాకు చెందిన గిరిజన రైతు భూక్యా విజయ్‌కుమార్ రైతులందరికీ రుణమాఫీ, ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కోరుతూ చేపట్టిన బైక్ యాత్ర గురువారం మొదలైంది. తల్లి భూక్యా సుశీల ఆశీర్వాదం తీసుకుని, బొడ్రాయివద్ద కొబ్బరికాయ కొట్టి బైక్‌యాత్రను మొదలు పెట్టారు.
మద్దతుగా రైతులు బానోత్ వీరన్న, భూక్యా ప్రసాద్ పాల్గొనగా పోలంపల్లి తండా, స్టేషన్ గుండ్రాతిమడుగు, రాజోలు గ్రామాల్లో మొదటిరోజు యాత్ర సాగింది. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతు భరోసా, రుణమాఫీ పూర్తిగా ఇచ్చేవరకు పోరాటం ఆపనని చెప్పారు.