Home
Telangana
Farmer Attempted Suicide Unable To Cope With Financial Difficulties Dwarakapet Narsampet Municipality
ఆర్థిక ఇబ్బందులతో అన్నదాత ఆత్మహత్యాయత్నం.. నర్సంపేటలో ఘటన
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకపేటలో జరిగింది.
నర్సంపేట, జూన్ 22: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని ద్వారకపేటలో జరిగింది. రైతు బూరుగు చిన్న సాంబయ్య తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో వరి సాగు చేస్తున్నాడు. పంట పెట్టుబడి కోసం అప్పు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురొంటున్నాడు. ఇదే సమయంలో రోడ్డు విస్తరణలో భాగంగా తన ఇంటిని ఎలాగైనా కూల్చివేస్తారని ఇరుగు పొరుగువారు మాట్లాడుకుంటుండటంతో వేదనకు గురయ్యాడు.
ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పు తీర్చక ముందే ఇంటిని కూల్చివేస్తారనే భయం వెంటాడటంతో మనస్తాపానికి గురైన సాంబయ్య సోమవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని వరంగల్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

