నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్ మెదక్: తెలంగాణలో పుష్కలంగా ఉపాధి లభిస్తుండటంతో ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు బతుకుదెరువు కోసం ఇక్కడికి వస్తున్నారు. మహారాష్ట్రలోని యావత్మాల్, నాందేడ్ జిల్లాల నుంచి మహిళా కూలీలు పెద్ద సంఖ్యలో వచ్చారు. మంగళవారం మెదక్ జిల్లాలోని మాచవరం, ర్యాలమడుగు, మాందాపూర్, లక్ష్మీనగర్ తదితర గ్రామాల్లో 300 మందికిపైగా మహిళలు వరినాట్లు వేశారు. వరి నాటువేస్తే రోజు కూలి రూ.300 చెల్లిస్తున్నారు. 15 మంది కూలీలు ఎకరం నాటు వేయడానికి రూ.5 వేల వరకు తీసుకొంటున్నారు. స్థానికంగా కూలీల కొరత ఉండటంతో రైతులు వీరితో పనులు చేయించుకొంటున్నారు.