ఏంటి ఈ ఫొటో చూడగానే గోవాలోని రిసార్టులు అనుకొంటున్నారా? కాదు మన హైదరాబాదే. హిమాయత్‌సాగర్‌కు ఆనుకొని ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన సోదరుల గెస్ట్ హౌస్ లు ఇవి. ఎరుపు రంగు రూఫ్టైల్స్తో మెరిసిపోతున్న విలాసవంతమైన నిర్మాణం పొంగులేటిది. ఆధునికత ఉట్టిపడేలా నలు పు రంగు షెడ్స్ ఉన్నవి ఆయన సోదరుడివి.
ఈ నిర్మాణాల పక్కనే జలాశయం కనిపిస్తున్నది కదూ. ఈ గెస్ట్‌హౌస్‌లు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. కానీ దీన్ని నిర్ధారించే జలమండలి రాళ్లు ఎక్కడున్నాయో… ఉన్న ప్రదేశం నిజమైనదో! కాదో!! తేల్చుకోలేని దుస్థితి. ఈ నిర్మాణాలు బఫర్‌జోన్‌లోనే ఉన్నాయనేది చూసే ప్రతి ఒక్కరికీ ఇట్టే అర్థమవుతుంది.