హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ భవన్ ఇన్చార్జిగా సుదీర్ఘ కాలం సేవలందించిన మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వీడ్కోలు కార్యక్రమాన్ని సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించనున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్న కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హాజరుకానున్నారని పార్టీ నాయకులు వెల్లడించారు. పార్టీ నాయకులు పాల్గొనాలని వారు కోరారు.