MLC Kavitha | ఈడీ కాదు.. మోదీ విచారణ.. ఎమ్మెల్సీ కవితకు సామాజిక మాధ్యమాల్లో అభిమానుల మద్దతు
ఈడీ విచారణకు హాజరవుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సామాజిక మాధ్యమాల్లో అభిమానులు, కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. మహిళను టార్గెట్ చేసి ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు నెటిజన్లు ఆరోపించారు. కవితను విచారణ చేస్తున్నది ఈడీ కాదని మోదీ అన్న వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈడీ కార్యాలయంలో కవిత కూర్చున్న ప్రదేశం వెనుక మోదీ ఫొటో ఉండటాన్ని పలువురు ప్రశ్నించారు.
- ఇవిగో కవిత ఫోన్లు.. ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి
హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): ఈడీ విచారణకు హాజరవుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సామాజిక మాధ్యమాల్లో అభిమానులు, కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. మహిళను టార్గెట్ చేసి ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు నెటిజన్లు ఆరోపించారు. కవితను విచారణ చేస్తున్నది ఈడీ కాదని మోదీ అన్న వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈడీ కార్యాలయంలో కవిత కూర్చున్న ప్రదేశం వెనుక మోదీ ఫొటో ఉండటాన్ని పలువురు ప్రశ్నించారు. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అత్యున్నత కార్యాలయంలో మోదీ ఫొటో దేనికి సంకేతమంటూ నిలదీశారు. కవిత తన ఫోన్లను మాయం చేశారంటూ వచ్చిన ఆరోపణలకు జవాబుగా.. ఆమె తన ఫోన్లను ఒక కవర్లో పెట్టి అందరికీ చూపిస్తూ ఈడీ కార్యాలయం వెళుతున్న ఫోటో వైరల్ అయ్యింది.
తన ఫోన్లను కవిత ధ్వంసం చేశారని గతంలో ఈడీ, సీబీఐ చేసిన ఆరోపణలకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. దీంతో గతంలో తప్పుడు ఆరోపణలు చేసిన బీజేపీ, కాంగ్రెస్, ఇతరులపై కవిత అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘కవితక్క ఫోన్లు ధ్వంసం చేసిందన్నోళ్లను, ఆ వార్త రాసినోళ్లను ఏ చెప్పుతో కొట్టాలి ఇప్పుడు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తప్పుడు ప్రచారాలతో తనపై నిందలు మోపుతూ, మోదీకి చెంచాగిరి చేస్తున్న ఈడీ బాగోతాన్ని ఇట్లా సాక్ష్యంగా బయటపెట్టారు కవిత’ అంటూ స్పందించారు. ఫోన్లు ధ్వంసం చేశారని మాట్లాడిన నాయకులు ఇప్పుడు క్షమాపణ కూడా చెప్పాలి.. అని డిమాండ్ చేశారు. ఫోన్లు పగటకొట్టింది అన్నోడి దవడ పగలకొట్టే విధంగా, తాను వాడిన ఫోన్లన్నింటిని ఈడీ ఆఫీసుకు తీసుకెళ్లిన కవిత.. ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలు నోర్లు మూయాలి’ అంటూ మండిపడ్డారు. కవితకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో ఆమె అభిమానులు ఇలా పోస్టులు పెట్టారు.
ప్రధాని-అదానీ..
- ప్రధాని మోదీ- అదానీ సంబంధాలపై సోషల్ మీడియాలో ఒక మెసేజ్ వైరల్గా మారింది. వారి సంబంధాలు, కాంట్రాక్టులు దక్కే విధానంపై మెసేజ్ చక్కగా వివరించారు. సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని రచించారు.
- ప్రధాని మోదీ ఆస్ట్రేలియా పోతడు.. అదానీకి కాంట్రాక్టు వస్తది.
- ప్రధాని శ్రీలంక పోతాడు.. అదానీకి కాంట్రాక్టు వస్తది.
- రైతు చట్టాలు తెస్తారు…దేశమంతా అదానీ గోదాములు వస్తాయి.
- కరెంట్ చట్టాలు తెస్తారు.. మోటర్లకి అదానీ మీటర్లు తయారు చేస్తాడు.
- దేశమంతా పుల్వామా దాడిలో విచారంగా ఉంటది…
- మహారాష్ట్రలో ఎయిర్పోర్టును అదానీకి కట్టబెట్టే పనిలో ప్రధాని ఉంటడు.
- ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు వస్తాయి.. ఆయా రాష్ట్రాల్లో ఈడి, సీబీఐ దాడులు జరుగుతాయి.
- నల్లమల అడవులను, సింగరేణి కాంట్రాక్టులను అదానీ అడుగుతాడు…
- ఒప్పుకోకపోతే మత ఘర్షణలు, దర్యాప్తు సంస్థల వేధింపులు జరుగుతాయి.
సోషల్ మీడియాలోసెటైర్లు
- దేశం అంటే ప్రధాని
- ప్రధాని అంటే అదాని
- ఏకపార్టీ పాలన ఉండాలి
- శాశ్వత అధికారం రాచరికం కావాలి
- సంపదని అమ్మేసి ప్రజలు పేదరికంలోనే ఉండాలి
- రాష్ట్రాలు బలహీనంగా ఉండాలి
- రాష్ట్రాల సంపదని దోచుకోవాలి
- విశ్వగురు అనిపించుకోవాలి
- మత సంస్థ చేతిలో కీలుబొమ్మగా మారి ప్రజల ఆలోచన శక్తిని హరింపజేసేలా నిత్యం మత విద్వేష చేష్టలతో దేశాన్ని తిరోగమనం వైపు నడిపించాలి… ఇదీ బీజేపీ తీరు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- adani
- ED
- Mlc Kavitha
- Social media
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

