Fancy Numbers | కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 8: మేడ్చల్ రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్లపై టాప్‌గేర్‌లో దూసుకెళ్లింది. శుక్రవారం విడుదలైన ఫ్యాన్సీ నంబర్లపై ఒక్కరోజే రూ.36.45 లక్షల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. దీనిలో అత్యధికంగా ఒక్క 9999 నంబర్‌కు రూ.9,99,999 లక్షలు పలికింది.
వెంకట ప్రణీత్ డెవలపర్స్ నుంచి 9999 నంబర్‌కు రూ.10 లక్షలు వెచ్చించగా, మిగతా ఫ్యాన్సీ నంబర్లపై ఆదాయం సమకూరిన్నట్టు మేడ్చల్ రవాణా శాఖా అధికారి జిల్లా కిషన్ తెలిపారు. ప్రభుత్వం ఆన్లైన్లో ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా పారదర్శకంగా వాహానాల నంబర్లను బహిరంగంగా ప్రకటించడంపై ప్రభుత్వానికి ఆదాయం సమకూరడంతో వినియోగదారులకు మరింత నమ్మకాన్ని కల్పించిందని చెప్పారు.