విద్యుదాఘాతానికి కుటుంబం బలి
విద్యుదాఘాతానికి ఓ కుటుంబం బలైంది. ఈ విషాదకర ఘటన కామారెడ్డిలో చోటుచేసుకొన్నది. ఒకే కుటుంబంలో నలుగురు మరణించగా సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
- ఇద్దరు చిన్నారులతో సహా దంపతుల మృతి
- 3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం
కామారెడ్డి రూరల్, జూలై 12 : విద్యుదాఘాతానికి ఓ కుటుంబం బలైంది. ఈ విషాదకర ఘటన కామారెడ్డిలో చోటుచేసుకొన్నది. ఒకే కుటుంబంలో నలుగురు మరణించగా సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణ పరిధిలోని బీడీ వర్కర్స్ కాలనీలో నివాసం ఉంటున్న హైమద్ (35), పర్వీన్ (30) దంపతులు. వీరికి కూతురు మహీమ్(6), కొడుకులు అద్నాన్(4), ఫైజన్ ఉ న్నారు. హైమద్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకొంటున్నాడు.
వర్షాల కారణంగా పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో హైమద్ తన కుటుంబంతో కలిసి పక్క వీధిలో ఉండే అత్తగారింటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం భార్య, కూతురు మహీమ్, కొడుకు అద్నాన్తో ఇంటికి చేరుకొన్నారు. మరో కుమారుడు ఫైజన్ అక్కడే ఉండిపోయాడు. దుస్తులు ఆరేసేందుకు ఇంట్లో కట్టిన జీఏ వైరు ఒకవైపు తెగిపోయి విద్యుత్ మీటర్ వద్ద ఉండే ఫీజుపై పడింది. దీంతో జీఏ వైరుతోపాటు దానిపై ఆరేసిన దుస్తులు తడిగా ఉండటంతో విద్యుత్తు సరఫరా అయ్యింది.
కూతురు మహీమ్ ఆడుకొంటూ దుస్తుల వద్దకు వెళ్లగా షాక్ తగలడంతో ఒక్కసారిగా కేకలు వేసింది. గమనించిన పర్వీన్ కూతురిని రక్షించే క్రమంలో తనకు కూడా షాక్ తగిలి కుప్పకూలింది. వారిని రక్షించేందుకు వచ్చిన హైమద్ సైతం కరెంట్ షాక్కు గురయ్యాడు. ఏం జరుగుతుందో తెలియక తండ్రి వద్దకు వెళ్లిన కొడుకు అద్నాన్ సైతం విద్యుదాఘాతానికి బలయ్యాడు. గమనించిన స్థానికులు విద్యుత్తు అధికారులకు సమాచారం ఇవ్వడంతో కరెంట్ సరఫరా నిలిపివేశారు. కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా దవాఖానకు తరలించినట్టు డీఎస్పీ సోమనాథం తెలిపారు. ఘటనా స్థలాన్ని కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పరిశీలించారు. బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా విప్ గంప గోవర్ధన్ రూ.25 వేలు అందజేశారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి మృతులు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టు ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

