కన్నాయిగూడెం, నవంబర్ 9 : ములుగు(Mulugu) జిల్లా కన్నాయిగూడెం మండ లం గూర్రేవుల గ్రామానికి చెందిన తిరుణగరి రాజు, సంగీత దంపతుల చిన్న కొడుకు హరినాథ్ (7) పాముకాటుతో శ నివారం మృతి చెందాడు. బాలుడి మృతి కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందే కారణమంటూ మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆదివారం పీహెచ్సీ ఎదుట ధర్నా నిర్వహించారు. వైద్యులు, సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క సూది వేసినా తమ కొడుకు బతికేవాడని తల్లిదండ్రులు భోరున విలపించారు.
డీఎంఎచ్‌వో రావాలని, విధుల్లో అలసత్వం వహించిన వైద్యులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశా రు. సీతక్క (Minister Seethakka) నియోజకవర్గంలో వైద్యులు పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. అయినా ఎవ రూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఐ శ్రీనివాస్ బాధితులను శాంతిపజేసే ప్రయత్నం చేసినా ఫలితంలేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. సీఐ డీఎంహెచ్‌వోతో ఫోన్లో మాట్లాడి నిర్లక్ష్యం వహించిన వైద్య సిబ్బందిని సస్పెండ్ చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.