Adluri Laxman | ఏడాదికోసారి ఇదేం అవమానం?.. అడ్లూరిని నిలదీసిన అమరుల కుటుంబాలు
Adluri Laxman | రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు అమరవీరుల కుటుంబాల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
Adluri Laxman | కరీంనగర్, జూన్ 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కరీంనగర్ కలెక్టరేట్: రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లాకేంద్రంలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు అమరవీరుల కుటుంబాల నుంచి చేదు అనుభవం ఎదురైంది. అమరుల కుటుంబాలను సన్మానించేందుకు మంత్రి వేదిక దిగి వారివద్దకు వెళ్లారు. సదరు కుటుంబాల వారు ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మ్యానిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీనైనా మీ ప్రభుత్వం నేరవేర్చిందా?’ అని ప్రశ్నించిన తీరు కలకలం రేపింది. ‘ఏడాదికోసారి పిలుసుడు.. శాలువా కప్పి, దండేసి పంపుడు. రాష్ట్రం కోసం చనిపోయిన మా పిల్లల పేరు మీద మాకు సన్మానం చేస్తున్నారో.. లేక అవమానపరుస్తున్నారో అర్థం కావడం లేదు. ఎన్నికల ముందు ఏమేమి మాట్లాడిన్రు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఏమేం అంశాలు పెట్టిన్రు. మాకిచ్చిన హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తరు? మా పిల్లల త్యాగాలతోనే తెలంగాణ వచ్చింది. వారి పేర్లపై అధికారం అనుభవిస్తున్నరు. చెట్టంత కొడుకులను పోగొట్టుకుని మేము క్షోభ పడుతున్నం. తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న గౌరవం ఇదేనా?’ అంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులు ప్రశ్నించారు.
ఊహించని విధంగా ఒక్కసారిగా ఎదురైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన మంత్రి అడ్లూరి.. సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెబుతూనే, పక్కనే ఉన్న మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో ‘మీ నియోజకవర్గం వాళ్లే కదా? ఏమైనా ఉంటే వారికి చూడు’ అంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్లారు. ‘మ్యానిఫెస్టోలో పెట్టిన గౌరవ భృతి ఏదీ? 250 గజాల జాగ ఏదీ’ అంటూ ఊపిరి సలుపనివ్వకుండా ప్రశ్నించడంతో మంత్రి అడ్లూరి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. వారి ప్రశ్నలు ప్రభుత్వానికి అసౌకర్యంగా మారినా, ఈ ఘటన అక్కడున్న వారందరినీ ఆలోచింపజేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

