హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫేక్ ప్లేస్మెంట్ దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఆయా కాలేజీల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ప్లేస్మెంట్ కల్పించడం కోసం యాజమాన్యాలు పలు కంపెనీలతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇంజినీరింగ్ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు ప్లేస్మెంట్ పేరిట జాబ్ ఆఫర్ లె టర్లు చేతిలో పెడుతున్నారు.
ఆ తర్వాత ఏదో ఒక సాకుతో టెర్మినేషన్ లెటర్లు ఇ స్తున్నారు. చివరకు మోసపోయానమని గుర్తించిన విద్యార్థులు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఇటీవల జేఎన్టీయూ అధికారులకు ఫిర్యాదులు అందగా, వారు స్పందించారు. ఇకపై కాలేజీల్లో తనిఖీలు చేపడుతామని జేఎన్టీయూ ఇ న్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే వెంకటేశ్వరరావు తెలిపారు.