Fake Phonepe | నిర్మల్ అర్బన్, జూలై 11: డబ్బులు అత్యవసరం ఉందంటూ వ్యాపారులను మోసగిస్తున్న ఫేక్ ఫోన్‌పే యాప్ ముఠా సభ్యులను గురువారం నిర్మల్ పోలీసు లు అరెస్టు చేశారు. నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా రెంజర్ల మండలంలోని పలు గ్రామాలకు చెందిన జమెల్ల భరత్ (కోరియర్ బాయ్), ధరంసోత్ సాయికిరణ్ (కూలీ), రాథోడ్ అరుణ్ (కూలీ), రాథోడ్ జీవన్ (హార్వెస్టర్ ఆపరేటర్) స్నేహితులు. టెన్త్, ఇంటర్ వరకు చదువుకున్న వీరు సులువుగా డబ్బులు సంపాదించాలని ఫేక్ ఫోన్‌పే యాప్‌ను ఉపయోగించి మోసాలకు పాల్పడే వృత్తిని ఎంచుకున్నారు.
ఫేక్ యాప్ ద్వారా డబ్బులు పంపకపోయినా పంపినట్టు (అమౌంట్ సెండ్ సక్సెస్ఫుల్) రా వడంతో నిజామాబాద్, రామాయంపేట, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో మోసాలకు పాల్పడ్డారు. జమెల్ల భరత్ స్నేహితులతో కలిసి గత నెల 2న నిర్మల్‌లోని పోలీస్ పెట్రోల్ బంక్‌కు వచ్చాడు. పెట్రోల్ పోసే వ్యక్తితో అత్యవసరం ఉన్నదని మాయమాటలు చెప్పి రూ.8 వేల న గదు ఫేక్ ఫోన్ పే యాప్ ద్వారా పే చేసినట్టు నమ్మించి నగదు తీసుకున్నాడు. వచ్చిన నగదును నలుగురు స మానంగా పంచుకున్నారు.
గత నెల 28న నిర్మల్‌లోని కావేరి పెట్రోల్ బంక్‌కు వెళ్లి బంధువులు దవాఖానలో ఉన్నారని నమ్మబలికి వారికి ఫేక్ యాప్ ద్వారా రూ.8 వేలు పంపినట్టు చేసి నగదు తీసుకుని ఉడాయించారు. వ్యాపారి తమ ఖాతాను పరిశీలించే సరికి నగదు రాకపోవడంతో పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చే పట్టారు. గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా అ నుమానాస్పదంగా కనిపించడంతో విచారించగా నేరం ఒప్పుకున్నారు. నలుగురిని అరెస్టు చేసి వీరి నుంచి నా లుగు మొబైల్ఫోన్లు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి వారి ని రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.