హైదరాబాద్: తన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్బుక్ (Facebook) ఖాతా సృష్టించారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (VC Sajjanar) అన్నారు. ఆపదలో ఉన్నానని, డబ్బులు పంపాలని మోసపూరిత మెసేజ్‌లు పంపిస్తున్నారని చెప్పారు. ఈ మెసేజ్ నిజమని నమ్మిన ఓ స్నేహితుడు రూ.20 వేలు పంపి మోసపోయారని తెలిపారు. డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్‌లను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అనుమానాస్పద లింక్‌లు, మెసేజ్‌లు, వీడియో కాల్స్ వస్తే బ్లాక్ చేయాలని సూచించారు. ఆయా సైట్లు బ్లాక్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నాని ఎక్స్ వేదికగా సూచించారు.
‘నా పేరుతో ఫేక్ ఫేస్బుక్ ఖాతాలు సృష్టించి, నా స్నేహితులకు ‘నేను ఆపదలో ఉన్నాను. డబ్బులు పంపించండి’ అని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపిస్తున్నారు. దురదృష్టవశాత్తు, నిజమే అనుకుని నా స్నేహితుడు ఒకరు రూ.20,000 ను మోసగాళ్ల ఖాతాకు పంపారు. నా వ్యక్తిగత ఫేస్ బుక్ పేజీ లింక్ ఇది.. https://facebook.com/share/1DHPndApWj/. ఇది మినహా నా పేరుతో ఉన్న మిగతా ఖాతాలన్నీనకిలివే. ఈ ఫేక్ ఖాతాలను మెటా సహకారంతో హైదరాబాద్ సైబర్ క్రైం టీం తొలగించే పనిలో ఉంది.
నా పేరుతో, లేదా ఏ అధికారి/ ప్రముఖ వ్యక్తి పేరుతో ఫేస్ బుక్‌లో వచ్చే రిక్వెస్ట్‌లను స్పందించకండి. డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మకండి. ఒకవేళ అలా ఎవరైనా మెసేజ్‌లు చేస్తే.. ముందుగా ఫోన్ ద్వారా వ్యక్తిని స్వయంగా సంప్రదించి పరిశీలించండి. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, వీడియో కాల్ లను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. సైబర్ మోసాలను వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా http://cybercrime.gov.in లో రిపోర్ట్ చేయండి. మనమంతా జాగ్రత్తగా ఉంటేనే.. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మనల్ని, మన డబ్బును కాపాడుకోగలం.’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు.
⚠️ Important Alert!
Cyber fraudsters have created fake Facebook accounts using my name and are sending messages to my friends saying, “I’m in trouble, please send money.”
Unfortunately, one of my friends was deceived and transferred ₹20,000 to a fraudster’s account.
This… pic.twitter.com/1epp6DR96j
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 15, 2025