సబ్‌రిజిస్ట్రార్ అండతో అక్రమాలు
హైదరాబాద్ శివార్లలోని ప్రైవేట్ ప్లాట్లకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొన్ని ముఠాలు కబ్జా చేస్తున్నాయి.
- ఒక్కో ప్లాట్ డబుల్రిజిస్ట్రేషన్కు 5 లక్షలు
- కీసరలో నకిలీ పత్రాలతో ఇతరులకు అమ్మకం
- పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివార్లలోని ప్రైవేట్ ప్లాట్లకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొన్ని ముఠాలు కబ్జా చేస్తున్నాయి. అనంతరం అవి ఇతరులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. ఈ కబ్జాలకు సంబంధించి కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోనే 8 కేసులు నమోదయ్యాయి. దీంతో డాక్యుమెంట్ రైటర్ ఉదయ్రెడ్డితోపాటు జంగాల శ్రీరామ్, గుబ్బల వెంకటేశ్వర్రావు అలియాస్ జీవీఆర్, బందెల్ల ప్రశాంత్ అలియాస్ బాబి, బందెల్ల ప్రభాకర్, పొన్నబోయిన బాలకృష్ణ అలియాస్ బాలు అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని లోతుగా ప్రశ్నించడంతో కీసర సబ్‌రిజిస్ట్రార్ రెహమాన్ సాయం చేసినట్టు వెల్లడైంది. ఒక్కో నకిలీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌కు రెహమాన్ రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్టు వెలుగులోకి వచ్చింది. దీంతో రెహమాన్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చి అరెస్టు చేయాల్సిన పోలీసులు ఆ విషయాన్ని పక్కన పెట్టేసినట్టు సమాచారం. రెహమాన్ హయాంలో దాదాపు 100 నకిలీ డాక్యుమెంట్లు రిజిస్టరైనట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

