Fake currency | కామారెడ్డి జిల్లాలో నకిలీ నోట్ల కలకలం
Fake currency | కామారెడ్డి జిల్లా(Kamareddy district) గాంధారి మండలం చద్మల్తండాలో నకిలీ 500 రూపాయల నోట్లు (Fake currency)కలకలం రేపాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గాంధారి, జనవరి 19: కామారెడ్డి జిల్లా(Kamareddy district) గాంధారి మండలం చద్మల్తండాలో నకిలీ 500 రూపాయల నోట్లు (Fake currency)కలకలం రేపాయి. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చద్మల్తండాలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా లక్ష్మమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధికి భక్తులు పెద్ద మొత్తంలో కానుకలు, వివరాలు సమర్పిస్తారు. ఆ డబ్బులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తండాలో అవసరం ఉన్న వారికి వడ్డీకి ఇస్తారు. కమిటీలోని ఓ బాధ్యుడు ఉత్సవాల అనంతరం వడ్డీకి ఇచ్చి, తిరిగి జాతర సందర్భంగా వాటిని తీసుకుంటాడు.
సుమారు రూ.కోటి వరకు ఆలయ డబ్బులు ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది కూడా జాతర అనంతరం డబ్బులను తండాలో అవసరం ఉన్న పలువురికి వడ్డీకి ఇచ్చారు. ప్రతి ఐదు వందల నోట్ల కట్టలో మూడు, నాలుగు నకిలీ నోట్లు ఉన్నట్లు కొందరు గుర్తించారు. ఈ విషయమై పలువురు బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా తండాలోని పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

