హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): వచ్చే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 8 వరకు జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎఫ్డీపీ) నిర్వహణకు యూనివర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యూనివర్సిటీకి చెందిన బోధనా సిబ్బంది, శాస్త్రవేత్తలు పాల్గొంటారు.
యూనివర్సిటీ ఫ్యాకల్టీతోపాటు అనుబంధ కళాశాలల అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లు హాజరయ్యేందుకు అవకాశం కల్పించారు. ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 22 వరకు గడువు ఉన్నట్టు యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో సంప్రదించాలని పేర్కొన్నారు.