హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ హాజరు(ఎఫ్ఆర్ఎస్) నమోదు ప్రారంభమైంది. 430 కాలేజీల్లో శనివారం నుంచి ఎఫ్ఆర్ఎస్ నమోదుకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు 430 కాలేజీల్లో 1,64,621 మంది విద్యార్థులకు 63,587 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ కృష్ణఆదిత్య తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు 10 సెకండ్ల సమయమే పడుతుందని వెల్లడించారు.
స్పౌజ్ బదిలీలు చేపట్టాలి : ఆర్‌యూపీపీ
హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యలో స్కూల్ అసిస్టెంట్ తెలుగు, హిందీ, పీడీల స్పౌజ్ బదిలీలు చేపట్టాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు తెలంగాణ రాష్ట్రం(ఆర్‌యూపీపీ టీఎస్) ప్రభుత్వాన్ని కోరింది. శనివారం సంఘం నేతలు సచివాలయంలో జీఏడీ ముఖ్య కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కాను కలిసి వినతిపత్రం సమర్పించారు. స్పౌజ్ బదిలీలు చేపట్టకపోవడంతో మహిళా టీచర్లంతా అవస్థలు పడుతున్నారని, మూడేండ్ల నుంచి ప్రతి రోజు 250 కి.మీ ప్రయాణం చేయాల్సి వస్తున్నదన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతకుంట జగదీశ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అనురాధ తదితరులు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.