కొల్లాపూర్, అక్టోబర్ 16: రాష్ట్ర వ్యా ప్తంగా ఉన్న సహకార సంఘాల పదవీకాలన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి, మాచినేనిపల్లి, నర్సాయిపల్లి, కొండ్రావుపల్లి, కొత్తపేట, కోడేరు, తూముకుంట సహకార సంఘాల చైర్మన్ల పదవీకాలాన్ని పొడిగించకుండా ప్ర భుత్వం కొర్రీలు పెట్టింది. దీనిపై పలువు రు చైర్మన్లు విస్మయానికి గురయ్యారు. అధికార పార్టీలో చేరిన చైర్మన్ల పదవీకాలాన్ని పొడిగించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. తమ పదవీకాలాన్ని పొడిగించకపోవడంపై సదరు సొసైటీల చైర్మన్లు కోర్టులను ఆశ్రయించినట్టు సమాచారం.
10న రాయ్‌దుర్గ్‌లో టీజీఐఐసీ భూ వేలం
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ):రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలోని రాయ్‌దుర్గ్ సర్వే నం-83/1లోగల 4,718 గజాల స్థలానికి టీజీఐఐసీ వచ్చేనెల 10న ఈ-వేలం నిర్వహించనున్నది. ఆప్సెట్ ధర గజానికి రూ. 3,10,000గా నిర్ణయించింది