హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : సర్కారు బడుల్లోని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల (ఎస్ఎంసీ) గడువును ప్రభుత్వం జూన్ 1 నుంచి నవంబర్ 31 వరకు పొడిగించింది. ఈ మేరకు శనివారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులిచ్చారు. కమిటీల గడువు నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నది. రాష్ట్రంలో మన ఊరు – మన బడి కార్యక్రమ పనులు ఈ కమిటీల ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు.