హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో నడిచే పలు ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ను పొడిగిస్తూ రైల్వే అధికారులు బుధవారం నిర్ణయం తీసుకున్నారు.
కాచిగూడ-మధురై, కాచిగూడ-నాగర్సోల్, నాందేడ్-ఎరోడ్, జల్నా-చాప్రా వంటి రైల్వేస్టేషన్ల పరిధిలో ఎనిమిది ప్రత్యేక రైళ్లు ఈ నెల 5 నుంచి జూన్ 30 వరకు షెడ్యూల్ వారీగా రాకపోకలు కొనసాగిస్తాయని వారు తెలిపారు.