హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 21 వరకు పొడిగిస్తూ ఢిల్లీలోని రౌస్అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో కవితపై సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. అనంతరం విచారణను వాయిదా వేసింది. ఇక సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటుపై వాదనలు ఉండనున్నాయి. ఇదిలాఉండగా జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తనకు చదువుకోవడానికి 9 పుస్తకాలు కావాలని కవిత కోరగా.. న్యాయస్థానం అనుమతించింది.