MJPTBCWREIS | హైదరాబాద్, మే15 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు విధించిన గడువును 20వ తేదీ వరకు పొడిగించారు. సొసైటీ కార్యదర్శి సైదులు గురువారం ప్రకటనలో వెల్లడించారు. రెగ్యులర్ కోర్సులతోపాటు ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్ తదితర వృత్తి విద్య కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా mjptbcwreis.telangana.gov.in లేదా tgrdccet. cgg. gov.in/TGRDCWEB లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బీసీ గురుకులాల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని, సదరు గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు ఫోన్ నంబర్ 040-23328266లో సంప్రదించాలని కార్యదర్శి సూచించారు.