మహదేవపూర్, ఫిబ్రవరి 7 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల పరిధిలోని అంబట్పల్లిలో ఉన్న మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్‌కు శుక్రవారం పర్యాటకుల తాకిడి పెరిగింది. గతంలో జలకళను సంతరించుకున్న బరాజ్ ప్రసుత్తం నీరు లేక ఎడారిని తలపిస్తున్న తీరును చూసి ఆవేదన వ్యక్తం చేశారు. నాడు కేసీఆర్ ముందు చూపుతో తాగు, సాగు నీరుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మించిన బరాజ్ నిర్లక్ష్యానికి గురికావడం బాధాకరమని చెప్పారు.
న్యాయం జరిగే వరకూ పోరాటం ; రెండోరోజూ పనులను అడ్డుకున్న నర్సిరెడ్డిగూడెం ముంపు బాధితులు
మర్రిగూడ, ఫిబ్రవరి 7 : న్యాయం జరిగే వరకూ శివన్నగూడెం ప్రాజెక్టు కట్టమీది నుంచి కదలబోమని నిర్వాసితులు భీష్మించుకుని కూర్చున్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం ముంపు గ్రామమైన నర్సిరెడ్డిగూడెం నిర్వాసితులు రెండో రోజైన శుక్రవారం టిప్పర్లను నిలిపి ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. పురుగుమందు, పెట్రోల్ డబ్బాలతో బైఠాయించారు.