హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): పోడు భూములపై హకులను నిర్ధారించే నిమిత్తం కమిటీలను ఏర్పాటు చేసేందుకు వీలుగా గిరిజన సంక్షేమశాఖ జారీచేసిన జీవో 140పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ వాదన వినకుండా జీవో అమలును నిలిపివేయలేమని స్పష్టం చేసింది.
పోడు భూముల హకులను ధ్రువీకరించేందుకు ఏర్పాటు చేసే కమిటీల్లో రాజకీయ పార్టీల నాయకులకు కూడా స్థానం కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన తేజావత్ శంకర్ సహా ముగ్గురు సంయుక్తంగా లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి కేసును ఈ నెల 23కు వాయిదా వేశారు.