తెలంగాణలో హైవేల విస్తరణ
దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ, ఒడిశా, బీహార్ రాష్ర్టాల్లో జాతీయ రహదారుల విస్తరణతోపాటు కొత్త రహదారుల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- రూ.7,597కోట్లతో రెండు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
- 190 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల విస్తరణ
హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ, ఒడిశా, బీహార్ రాష్ర్టాల్లో జాతీయ రహదారుల విస్తరణతోపాటు కొత్త రహదారుల నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా తెలంగాణలోని ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల జాతీయ రహదారి(ఎన్‌హెచ్-63) విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టును హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో చేపట్టేందుకు అంగీకారం తెలిపింది.
జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారి(ఎన్‌హెచ్-563) విస్తరణకు సైతం కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ పనులను బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్(బీవోటీ-టోల్) పద్ధతిలో విస్తరించనున్నట్టు పేర్కొన్నది. ఈ రెండు జాతీయ రహదారులను కలిపి 190 కిలోమీటర్ల మేర నాలుగు లైన్లుగా విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.7,597 కోట్ల వ్యయాన్ని కేంద్రం అంచనా వేసింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతోపాటు ప్రయాణ సమయం తగ్గి వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఊతం లభించే అవకాశం ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

